Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి మంచు లక్ష్మి... ఫలించిన మోహన్‌బాబు మంత్రాంగం.. రోజాకు ధీటుగా

మంచు లక్ష్మి... సీనియర్ నటుడు మోహన్ బాబు ముద్దుల పుత్రిక. వెండితెరపై నటిగానే కాకుండా బుల్లితెరపై యాంకర్‌గా ఆకట్టుకుంది. అలాగే, 'నేను సైతం' అనే కార్యక్రమం ద్వారా ఎందరికో దారి చూపి వారి జీవితాల్లో కొత్త

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (08:06 IST)
మంచు లక్ష్మి... సీనియర్ నటుడు మోహన్ బాబు ముద్దుల పుత్రిక. వెండితెరపై నటిగానే కాకుండా బుల్లితెరపై యాంకర్‌గా ఆకట్టుకుంది. అలాగే, 'నేను సైతం' అనే కార్యక్రమం ద్వారా ఎందరికో దారి చూపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈమె త్వరలోనే రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. 
 
ముఖ్యంగా.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇదే అంశంపై సంక్రాంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబుతో మోహన్ బాబు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించడంతో మంచు లక్ష్మి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వినికిడి. 
 
ప్రస్తుతం వైకాపాలో సినీ నటి ఆర్కే.రోజా ఎమ్మెల్యే గా పనిచేస్తున్నారు. ఈమెకు పోటీగా మంచు లక్ష్మిని బరిలోకి దించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా.. చంద్రగిరి స్థానం నుంచి లక్ష్మి నిబరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలోని టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడే మహిళా నేత లేకపోవడంతో, వైసీపీ రోజా కాస్త స్వరం పెంచుతుందని, ఆమె స్వరం తగ్గించాలంటే మంచు లక్ష్మి అయితేనే కరెక్ట్ అని తెలుగుదేశం నాయకులూ భావిస్తున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments