Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రధాన అర్చకుడిగా వుండగా రమణదీక్షితులను ఎలా నియమిస్తారు?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (18:54 IST)
టిటిడిలో మరో వివాదం నెలకొంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తన కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేసారు.
 
పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ప్రభుత్వం, టిటిడి, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ఎలా నియమిస్తారంటూ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. 
 
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉంటూ హైకోర్టును వేణుగోపాల దీక్షితులు ఆశ్రయించడం సంచలనంగా మారింది.  తెలుగుదేశం హయాంలో వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకులుగా నియమించారు. వయస్సు పైబడిన వారిని పదవీ విరమణ చేయించి ఆ తరువాత కొత్త వారికి అవకాశం కల్పించారు.
 
అప్పట్లో కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో పాటు ప్రభుత్వం మారడంతో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గత 15 రోజులకు ముందే రమణదీక్షితులతో పాటు పదవీ విరమణ పేరుతో ఉద్యోగం నుంచి పంపించేసిన వారికి తిరిగి అవకాశం కల్పించారు. దీంతో రమణదీక్షితులను మళ్ళీ ప్రధాన అర్చకులుగా నియమించారు.
 
తాను ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రప్రభుత్వం రమణదీక్షితులను నియమించడంపై హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు వేణుగోపాల దీక్షితులు. ప్రస్తుతానికి హైకోర్టు నుంచి నోటీసులు మాత్రమే వీరికి అందాయి. కానీ తదుపరి విచారణ ఏ విధంగా వస్తుందన్నది ఆశక్తికరంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments