Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ ప్లీజ్! వెలిగిపోతున్న వెల‌గ‌పూడి ఏపీ సెక్ర‌టేరియేట్!

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:43 IST)
స్వాంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ సెక్ర‌టేరియేట్ ను సుంద‌రంగా తీర్చిదిద్దారు. వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో ఆగ‌స్టు 15న పంద్రాగ‌స్టు జ‌రిపేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అయింది.

వెల‌గపూడి స‌చివాల‌యం అంతా ఇపుడు వెలిగిపోతోంది. రంగురంగుల కాంతులీనే విద్యుత్ దీపాల‌తో స‌చివాల‌యం దేదీప్య‌మానంగా వెలిగిపోతోంది. ఏటా ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26న స‌చివాల‌యాన్ని విద్యుత్ దీపాల‌తో అలంక‌రిస్తారు.

అయితే, ఈ సారి మ‌రింత ఆకర్ష‌ణ‌గా లైటింగ్ అమ‌ర్చారు. దీనితో ప‌లువురు సంద‌ర్శ‌కులు స‌చివాల‌యానికి చేరి రంగుల భ‌వ‌నాల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు. కొంద‌రు అయితే, ఈ విద్యుత్ దీపాల అలంక‌ర‌ణ‌లో స‌చివాల‌యాన్ని చూసి మంత్ర ముగ్దుల‌వుతున్నారు. యువ‌త కేరింత‌ల‌తో ఈ దృశ్యాల‌ను సెల్ఫీలు తీస్తున్నారు.

ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా స‌చివాల‌యం, అసెంబ్లీ ప్రాంగ‌ణాల్లో వేడుక‌లు నిర్వ హిస్తున్నారు. ఆదివారం ఉద‌యం 8గంట‌లకు అసెంబ్లీ భవనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆలాగే ఉ.8.15 గం.లకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

సచివాలయం మొదటి భవనం వద్ద ఉ.7.30 గం.లకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. మొద‌టి బ్లాకులోనే సీఎం కార్యాల‌యం ఉంటుంది. దీనితో ఇక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

రాత్రి పూట స‌చివాల‌యాన్ని చూస్తే, మిరుమిట్లు గొలుపుతూ, ఎంతో సుంద‌రంగా ఉంద‌ని స‌చివాల‌య సిబ్బంది ముచ్చ‌ట‌ప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments