Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (16:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ బంగారు గని బయల్పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఇది ఏర్పాటుకానుంది. ఇది దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని కావడం గమనార్హం. ఈ గని నుంచి యేటా 750 కేజీల బంగారం ఉత్పత్తికానుంది. రూ.200 కోట్ల పెట్టుడి పెట్టిన డెక్కన్ గోల్డ్ మైన్స్. ఇందుకోసం 250 ఎకరాల మేరకు విస్తీర్ణంలో ఏర్పాటుకానుంది. ఇప్పటికే 60 శాతం పూర్తయిన ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే 60 శాతం ప్లాంట్ నిర్మాణం పూర్తిగా, రోజుకు కిలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 
 
ఈ తొలి బంగారు గనిని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. సుమారు 250 ఎకరాల భూసేకరణ చేపట్టి భూగర్భం నుంచి పసిడిని వెలికితీసేందుకు రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తవడంతో పైలట్ స్థాయిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ ఎండీ హనుమ ప్రసాద్ తెలిపారు. ఈ యేడాది చివరికల్లా పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే యేటా 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.
 
మరోవైపు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని బంగారం గనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆసక్తి చూపుతోంది. ఈ గనులను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. దక్కన్ గోల్డ్ మైన్స్‌కు దేశంలో వివిధ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మొజాంబిక్‌‌లో లిథియమ్ గనులను ఆ సంస్థ తాజాగా కొనుగోలు చేసింది. రోజుకు 100 టన్నుల లిథియం, ఇతర ఖనిజాలను వెలికి తీసేందుకు భారీ ప్లాంట్లు నిర్మిస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
తాజాగా రాజస్థాన్‌లో అమ్మకానికి పెట్టిన రెండు బంగారు గనులను సొంతం చేసుకొనేందుకు వేదాంత గ్రూపు సంస్థ అయిన హిందూస్థాన్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్ పోటీపడుతున్నాయి. రాజస్థాన్‌లోని కంక్రియా గారా గోల్డ్ బ్లాక్, భూకియా-జగ్పురా గోల్డ్ బ్లాక్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తోంది. తాజాగా వేలంలో పాల్గొనేందుకు సాంకేతిక అర్హత సాధించిన కంపెనీల్లో అవి కూడా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments