ఏపీలో కుక్కను.. తెలంగాణాలో ఎద్దును ఢీకొన్న వందే భారత్ రైళ్లు

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (08:52 IST)
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా పేరొందిన వందే భారత్ రైళ్లు చిన్నపాటి ప్రమాదాలకే ఆగిపోతున్నాయి. ఆ మధ్య ఆవును ఢీకొనడం వల్ల రైలు ముందు డోమ్ దెబ్బతింది. తాజాగా కుక్కను ఢీకొనడంతో రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ రైలు... బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం కుక్కను ఢీకొంది. దీంతో ఆ రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. 
 
ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది అందించిన సమాచారం మేరకు.. రైలు చీరాల స్టేషన్‌ వద్ద కుక్కను ఢీకొనడంతో ప్రెజర్‌బాక్స్‌ను బలంగా తాకింది. దీనికి సంబంధించిన నట్టు దెబ్బతింది. దీంతో రైలు కొంత ముందుకువెళ్లి రైల్వేగేటు దాటి నిలిచిపోయింది. అనంతరం చెన్నైలోని నిపుణుల సలహా మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో రైలు ముందుకు కదిలింది.
 
అలాగే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఆదివారం పెనుప్రమాదం తప్పింది. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టాలపైకి అడ్డుగా వచ్చిన ఎద్దును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు కొద్ది నిమిషాలపాటు నిలిచిపోయింది. 
 
ఇంజిన్‌ ముందు భాగం (క్యాటిల్‌ గార్డ్‌) కొంత విరిగి సంఘటన స్థలంలో పడింది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన ఎద్దును తొలగించి రైలును పంపించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments