Publish Date: Tue, 24 Jun 2025 (13:55 IST)
Updated Date: Tue, 24 Jun 2025 (13:57 IST)
Dogs diving at the Olympics
శునకాలు యజమానుల పట్ల విశ్వాసంగా వుంటాయనే విషయం తెలిసిందే. అలాంటి శునకాలకు శిక్షణ ఇస్తే.. ఎలాంటి సాహసాలనైనా చేస్తాయి. ఇప్పటికే పోలీస్, ఆర్మీ విభాగాల్లో శునకాలు చేసే సాహసాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శునకాలకంటూ ప్రత్యేక ఆటల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా షేర్ అవుతోంది.
ఈ వీడియోలో శునకాలు అద్భుతంగా స్విమ్మింగ్ పూల్‌లో డైవ్ చేసి ఎంచక్కా దూకేస్తున్నాయి. ఇది సాధారణమైన క్రీడా పోటీలు కాదు. మొట్టమొదటి ఎనిమల్ ఒలింపిక్స్‌లో శునకాల డైవింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో వివిధ రకాలకు చెందిన శునకాలు అద్భుతంగా డైవ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాయి.
ఈ పోటీలు గత ఏడాది జరిగినా ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా వీడియోలో శునకాలు చేస్తున్న విన్యాసాలు నిజమేనా లేకుంటే ఏఐ వీడియోనా అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సెల్వి
Publish Date: Tue, 24 Jun 2025 (13:55 IST)
Updated Date: Tue, 24 Jun 2025 (13:57 IST)