Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరిట పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (11:34 IST)
ప్రేమ పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ప్రస్తుతం ఆ నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతోపాటు రూ.60వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు ప్రత్యేక మహిళా సెషన్స్‌ న్యాయమూర్తి ప్రేమలత తీర్పు వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సచివాలయనగర్‌కు చెందిన షేక్‌మహమ్మద్‌ జహంగీర్‌పాషా(29) లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో మేనేజరు. 2006-07లో హయత్‌నగర్‌ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఆ సమయంలో పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ చదివే సమయంలోనూ వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 2012 ఆమెను మభ్యపెట్టి అత్యాచారానికి వడిగట్టాడు. 
 
గర్భందాల్సిన ఆ యువతి పెళ్లి చేసుకోవాలంటూ నిలదీయగా అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకున్న జహంగీర్‌పాషా ముఖం చాటేశాడు. దీంతో ఆమె మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు ముందు హాజరు పరిచారు. ఇంకా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments