Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ కలెక్షన్లపై 'ఉరి' సర్జికల్ దాడులు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (09:50 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద సంస్థలపై భారత ఆర్మీ జరిపిన మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం "ఉరి". ఈ చిత్రం బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విక్కీ కౌషల్ నటించిన చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
 
జ‌మ్మూకాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఉన్న సైనిక స్థావ‌రంపై పాక్ ఉగ్ర‌వాదులు దాడి చేసి భార‌త జ‌వాన్ల‌ను చంపేస్తారు. ఆ దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం అత్యంత ర‌హ‌స్యంగా స‌ర్జిక‌ల్ దాడుల‌ను నిర్వ‌హిస్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, యామీ గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా, కీర్తి కుల్హారీ వంటి నటీనటులు నటించారు. 
 
'ఉరి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌ైక్' పేరుతో వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నెల 11వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇప్ప‌టికే రూ.వంద కోట్లు రాబ‌ట్టింది. ఈ చిత్రం తొలివారంలో రూ.70.94 కోట్లు, రెండో వారంలో రూ.37.96 కోట్లు కలుపుకుని మొత్తం 108.90 కోట్లు సాధించినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. పైగా, 2019లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments