Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. అందుకే స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటున్నాం: ఇంద్రజిత్ సింగ్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కేంద్రం సాకులు చెప్పింది. రాజ్యసభలో ఏపీ స్పెషల్ స్టేటస్‌పై చర్చ జరిగిన సందర్భంగా హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పేసింది. నీతి ఆయోగ్ అమల్లోకి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:30 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కేంద్రం సాకులు చెప్పింది. రాజ్యసభలో ఏపీ స్పెషల్ స్టేటస్‌పై చర్చ జరిగిన సందర్భంగా హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పేసింది. నీతి ఆయోగ్ అమల్లోకి రాకముందు దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ప్రత్యేక హోదా రావాలంటే.. ఎన్డీసీ అనుమతి తప్పదని స్పష్టం చేశారు. కానీ ఏపీ ప్రత్యేక హోదాకు ఎన్డీపీ ఆమోదం లభించలేదన్నారు. అందుకే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా... ఏపీని స్పెషల్ కేటగిరీ స్టేట్‌ అంటున్నామని చెప్పారు.
 
ఉత్తరాఖంఢ్ తర్వాత మరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని.. ఎన్డీసీ ఆమోదం రాకపోవడంతోనే ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా పరిగణిస్తున్నామని ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఇంకా ఇతర రాష్ట్రాలకు అదనంగా పది శాతం నిధులిస్తున్నామని చెప్పారు. అందువల్ల ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని ఇంద్రజిత్ సింగ్ తేల్చి చెప్పేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments