Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రాధిక రాడాన్ టీవీకి ఐటీ ఎటాక్... రాధికను శరత్ కుమార్ బాగా ఇరికించారా...?

శశికళకు మద్దతు పలికడమే కాకుండా రాడాన్ టీవీ నుంచి ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7 కోట్లు పంచేశారంటూ నటుడు శరత్ కుమార్ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఇంటిపైన, అలాగే ఆయన భార్య, నటి రాధిక రాడాన్ టీవీ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్త

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:17 IST)
శశికళకు మద్దతు పలికడమే కాకుండా రాడాన్ టీవీ నుంచి ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7 కోట్లు పంచేశారంటూ నటుడు శరత్ కుమార్ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఇంటిపైన, అలాగే ఆయన భార్య, నటి రాధిక రాడాన్ టీవీ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఏదో అలా సినిమాలు, టీవీ సీరియళ్లు చేసుకుంటున్న రాధికకు ఐటీ సోదాలు షాక్‌కు గురిచేశాయి. మరి ఈ సోదాల్లో అక్రమంగా బయటపడే డబ్బు ఎంతన్నది తెలియాల్సి వుంది.
 
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో అంతా బావుంటే రేపే ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ పరిస్థితి తారుమారయింది. ఇక్కడ నుంచి పోటీకి దిగిన దినకరన్ తన శక్తి మేరకు ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి ప్రయత్నమే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా సుమారు 90 కోట్ల రూపాయలకు పైగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
సాధారణమైన నియోజకవర్గమైతే వదిలేసేవారే కానీ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు డబ్బు పంచారంటూ 9 మంది మంత్రులపై ఆరోపణలు రావడంతో వారిని ఐటీ శాఖ విచారిస్తోంది. ఇంకోవైపు పార్టీ గుర్తు రెండాకులు లేకుండా టోపీ గుర్తుపై పోటీ చేయాల్సి రావడం ఒక రకంగా అన్నాడీఎంకే పార్టీకి పెద్ద దెబ్బయ్యింది. 
 
అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు డబ్బు పంచినట్లు ఆరోపణలు రావడంతో వారి ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ వార్తలన్నిటినీ విన్న శశికళ జైల్లోనే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తమ్మీద జయలలిత తను ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి శశి వర్గం గెలుస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments