Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విజయవాడకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:51 IST)
కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 
 
కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. అలాగే, కొత్తగా మరో 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. 
 
ఆ తర్వాత బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడ కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ఆయన ప్రారంభిస్తారు. గుడివాడ రైల్వే గేట్లు దాటేందుకు 2.5 కిలో మీటర్ల మేరకు వంతెనను నిర్మించారు. ఇందుకోసం కేంద్రం రూ.317.22 కోట్లను మంజూరు చేసింది. ఈ పర్యటన సమయంలో ఆయన ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో కొంత సేపు గడుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments