Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లకుభేరులపై ఉక్కుపాదం.. తెల్లధనం ఉద్యమం మొదలైంది..: మంత్రి వెంకయ్య

దేశంలోని నల్లకుభేరులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అదేసమయంలో తెల్లధనంపై ఉద్యమం మొదలైందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (14:04 IST)
దేశంలోని నల్లకుభేరులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అదేసమయంలో తెల్లధనంపై ఉద్యమం మొదలైందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సంచలన ప్రకటనపై ఆయన స్పందించారు. 
 
ప్రస్తుతం నల్లకుభేరుల పీచమణుస్తూ దేశంలో తెల్లధనం ఉద్యమం మొదలైందని, ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెద్ద నోట్లను రద్దు చేయడం పట్ల సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నది కాదని, మోడీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి నల్లధనాన్ని రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకున్నారని, ఇందులోభాగంగానే పెద్ద నోట్ల రద్దు ఒకటి అని చెప్పారు. 
 
మోడీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేధావులంతా స్వాగతిస్తున్నారన్నారు. కొద్ది మంది ప్రతిపక్ష నేతలు మాత్రమే రాజకీయం చేస్తున్నారన్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలోనే నల్లధనంపై సిట్‌ను ఏర్పాటు చేసి విదేశాల్లోని ఖాతాలు, డబ్బును స్వతంత్రంగా వెల్లడించేందుకు అవకాశం ఇచ్చారని, మోడీ పిలుపునకు మంచి స్పందన వచ్చిందన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడంతో భూముల ధరలు తగ్గుతాయని, మధ్య తరగతి ప్రజలకు ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే పట్టుదల, నిబద్ధత, దూరదృష్టి ఉండాలని మోడీ నిరూపించారని గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments