Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం, ఏమైంది?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (16:30 IST)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు చిన్నపాటి గాయమైంది. విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాలులో ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ తలకు కార్ డోర్ తగిలింది. దీంతో ఫస్ట్ ఎయిడ్ అనంతరం తన పర్యటన కొనసాగించారు కేంద్ర‌మంత్రి.
 
అంతకుముందు ఆయన మాట్లాడుతూ... విజయవాడతో తనకు అవినాభావ సంబంధం ఉందని, నేడు కేంద్ర మంత్రిగా ఇక్కడి రావడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం... ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు.
 
తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి విజయవాడ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడలో వేదిక కన్వెన్షన్ హాల్ లో జన ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. అత్యధికంగా 27 మంది బీసీలు ఉన్న కేంద్ర మంత్రి వర్గంలో తాను ఉండటం గర్వకారణమని కిషన్ రెడ్డి చెప్పారు.
 
ప్రధాని మోదీ ఆదేశానుసారం జన ఆశీర్వాద యాత్ర చేస్తున్నామని, దేశం కోసం బలిదానం చేసిన వారిని స్మరిస్తూ, ఆజాదీ కా అమృత్ వర్ష్ జరుపు కొంటున్నామని చెప్పారు. దేశ ప్రజలంతా విధిగా మాస్క్ ధరించి, అంతా కోవిడ్ నియమాల్ని పాటిస్తే, మూడో వేవ్ రాదని కిషన్ రెడ్డి సూచించారు.
 
ప్రధాని మోదీ అవినీతి లేని పాలన అందిస్తున్నారని, పేదలకు గృహ నిర్మాణం చేపడుతున్నామని, అలాగే 80 కోట్ల మందికి కేజీ 3 రూపాయల బియ్యం కేంద్రం అందిస్తోందని, కరోనా సమయంలో అది కూడా ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments