Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ధనవంతుల జాబితాలో డీమార్ట్ అధినేత

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (16:29 IST)
ప్రపంచ ధనవంతుల జాబితాలో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ చేరారు. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలోని అతి పెద్ద రిటైల్ సరుకుల చెయిన్ మాల్స్‌ను నిర్వహిస్తుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర మాల్స్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకే అందించే ఈ సంస్థ కోట్లాదిమంది వినియోగదారులకు చేరువైంది. మధ్య తరగతి వారు సైతం డీ మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారు. 

ముఖ్యంగా కరోనా సమయంలో ఈ సంస్థ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. కరోనా సమయంలో అత్యధిక లాభాలు సంపాదించిన సంస్థల్లో డీమార్డ్ ముందు వరుసలో ఉంది. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, నిత్యావసర సరుకులను, వస్తువులను వినియోగదారులకు అందించడం ద్వారా… డీమార్ట్ తన వ్యాపారాన్ని అనేక రెట్లు పెంచుకుంది.
 
అలాంటి సంస్థ అధినేతకు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోని టాప్ 100 కుబేరుల జాబితాలో దమానీకి చోటు దక్కింది. ప్రముఖ ఆర్థిక సర్వే సంస్థ బ్లూమ్ బర్గ్ ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో దమానీ 98వ స్థానంలో నిలిచారు. దమానీ నికర సంపద రూ.1,38,000 కోట్లు(19.2 బిలియన్ డాలర్లు)గా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments