Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌కు సర్వీసు గండం... హోంశాఖకు ఫిర్యాదు!

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగం ఏడీజీగా సునీస్ కుమార్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సర్వీస్ గండం ఏర్పడింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య ఉత్పన్నమైంది. మతం మార్పుచుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సునీల్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. 
 
సునీల్‌కుమార్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ... లీగల్‌ రెట్స్‌ అడ్వైజరీ(ఎల్‌ఆర్‌వో) కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్‌ పొంది... క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీస్‌ నుంచి తప్పించాలని అందులో పేర్కొన్నారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న... మద్రాస్‌ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‌కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. 
 
సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ పేరుతో... సునీల్‌కుమార్‌ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పేర్కొన్నారు. అంబేద్కర్‌ మిషన్‌ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్‌ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్‌ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ సమోదు చేసి... పూర్తిస్థాయిలో హోంశాఖ దర్యాప్తు చేయాలని ఎల్‌ఆర్‌వో కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments