Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అప్పు రూ.3.98 లక్షల కోట్లు

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (08:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.  
 
ఏపీ అప్పుల భారం ప్రతి యేటా పెరుగుతుందని కేంద్రం తెలిపింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు ఉండగా, ఇపుడు ఇది రూ.3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 
 
గత 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, 2020-21 నాటికి రూ.17.1శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని వెల్లడించింది. గత 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శతాంగా ఆ తర్వాత ఇది తగ్గిందని తెలిపారు. 
 
అదేవిధంగా 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, అదే 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments