Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి.. అబ్బాయి కాదు.. ఇది ఇద్దరమ్మాయిల ప్రేమకథ...

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (16:42 IST)
అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకోవడంలో తప్పు లేదు. ఇంకా అందులో అర్థం వుంది. కానీ అమ్మాయి.. మరో అమ్మాయి ప్రేమించుకుంటే..? అదే జరిగింది. ఇది ఇద్దరమ్మాయిల ప్రేమ కథ. అంతేగాకుండా వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఈ వ్యవహారం ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతుల ప్రేమాయణం కర్నూలుతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాలను అయోమయానికి గురిచేస్తోంది. 
 
కర్నూలు లోని సంతోష్ నగర్‌కు చెందిన యువతి (21), నర్సింహ రెడ్డి నగర్‌కు చెందిన మరో యువతి (20) ఇంట్లో నుండి పరారయ్యారు. వీరిరువురు పెద్దవాళ్లు తమ ప్రేమను ఒప్పుకోనందుకు ఇంటి నుంచి వెళ్లిపోయారు.ఆ ఇద్దరు యువతులు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. 
 
ఇంతలో నర్సింహరెడ్డి యవతిని ఇంట్లో వాళ్లు చదువు మాన్పించారు. ఇటీవలే ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని తెలిసింది. అది ఆ యువతికి నచ్చలేదు. చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన తన మిత్రురాలితోనే జీవితం గడపాలనుకుంది. చిన్నప్పటి నుంచే స్నేహం ఉన్న వారి మధ్య.. అది కాస్తా ప్రేమ బంధంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి బుధవారం ఇరువురి తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
 
దీంతో ఇరువురి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రెండో పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ యువతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments