Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణాకర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా... అందుకే నోటీసులా...?

కరుణాకర్‌రెడ్డి తుని ఘటనలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత సిఐడీ విచారణలో కరుణాకర్‌ రెడ్డే వెనుక నుండి స్కెచ్‌ వేశారని నిర్ణయానికి వచ్చారు. దీంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా నోటీసులు అందించారు.

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:40 IST)
కరుణాకర్‌రెడ్డి తుని ఘటనలో ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. సిఐడీ విచారణలో కరుణాకర్‌ రెడ్డే వెనుక నుండి స్కెచ్‌ వేశారని నిర్ణయానికి వచ్చారు. దీంతో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరుగుతుండగా నోటీసులు అందించారు. ఈ నెల 6వ తేదీ కోర్టుకు సిఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మూడురోజులుగా కరుణాకర్‌రెడ్డిని కలిసేందుకు సిఐడీ అధికారులు ప్రయత్నిస్తే చివరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో దొరికారు కరుణాకర్‌రెడ్డి. 
 
కరుణాకర్‌ రెడ్డి పక్కా ప్లాన్‌ గీసి ముద్రగడ పద్మనాభంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రైలును తగులబెట్టడం, విధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం. ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అంతేకాదు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకుంది. హోంమంత్రి చినరాజప్ప దీని వెనుక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అనుకున్న విధంగానే సిఐడీ అధికారులకు అప్పజెబితే ప్రస్తుతం చివరకు కరుణాకర్‌ రెడ్డి మెడకు వచ్చి చుట్టుకుంది. కరుణాకర్‌ రెడ్డితో పాటు మరో 20మంది ఇందులో విచారించేందుకు గుంటూరులోని సిఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
 
కరుణాకర్‌ రెడ్డే ఈ ఘటనకు సూత్రధారి అని పక్కా ఆధారాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కరుణాకర్‌రెడ్డి ఫోన్‌ను ట్యాప్‌ చేశారనీ, దానితోనే మరికొన్ని ఆధారాలు లభించినట్లు చెప్పుకుంటున్నారు. పక్కా ఆధారాలు ఉండడంతోనే మొదటగా కరుణాకర్‌రెడ్డినే సిఐడీ అధికారులు విచారించనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments