Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సంస్థలపై టీటీడీ కన్నెర్ర

Webdunia
సోమవారం, 26 జులై 2021 (06:59 IST)
శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు నమోదు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపింది.

కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని టీడీపీ పేర్కొంది. చెన్నై‌కి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపింది.

దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారని పేర్కొంది. భక్తులు www tirupatibalaji.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది.

భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments