Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల : భూమన కరుణాకర్ రెడ్డి

ఠాగూర్
సోమవారం, 28 అక్టోబరు 2024 (13:54 IST)
వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంలో వివాదాలు పొడచూపాయి. దీంతో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటిలో వైకాపా నేత, తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. 
 
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల అని అన్నారు. ఆమెలాంటి చెల్లెలు జగన్‌కు ఉండడం బాధాకరమన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని చూసే తెలుగుదేశం పార్టీతో ఆమె కుమ్మక్కు కావడం దారుణమన్నారు. జగన్‌ను సర్వనాశనం చేయాలనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏ ఒక్కరూ షర్మిల వెనుక నడవలేదనీ, అంతా జగన్ వెనుకే నడిచారన్నారు. ఇవన్నీ గ్రహించిన షర్మిల తెలంగాణకు వెళ్లారనీ, చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆమెకు మద్దతులేదని భూమన జోస్యం చెప్పారు. కాగా.. జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు కూటమి కుట్రగానే కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ తిరుమలలో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments