Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఆ మూడు దర్శనాలు రద్దు... మరి వారి పరిస్థితి ఏంటి?

Webdunia
శనివారం, 13 జులై 2019 (22:04 IST)
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 
 
శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ దర్శనాలను ఏర్పాటు చేసిందని అందువల్లే వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వీఐపీ దర్శనాల్లో కూడా కోతలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఏడాదికి ఒకసారే శ్రీవారి దర్శనానికి వీఐపీలు రావాలని కోరుతున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు 10, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో టీటీడీ బోర్డ్ నియామకం ఉంటుందని తెలిపారు. టీటీడీ బోర్డ్ ఆస్పత్రిని పరిశీలించారు వైవీ సుబ్బారెడ్డి. ఆస్పత్రిలో 40 గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆపరేషన్స్ త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఆపరేషన్ థియేటర్లలో పరికరాలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments