Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్దాయన పర్యవేక్షణ, ఎన్ని లక్షల మెజారిటీ తెలుసా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (19:17 IST)
పార్టీకి ఒక పెద్దాయన ఉంటారు. తెలిసిందే. ఒక్కో పార్టీకి ఒక్కొక్కరు ఉంటారు. ప్రస్తుతానికి వైసిపికి పెద్ద దిక్కు.. పెద్దాయన వై.వి.సుబ్బారెడ్డి. ప్రస్తుత టిటిడి ఛైర్మన్. ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. అది కూడా తిరుపతి ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు సుబ్బారెడ్డిని ప్రత్యేక పర్యవేక్షణ కోసం నియమించారు. తిరుపతిలో ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్ళాలని సూచించారు.
 
అంతేకాకుండా ఈ నెల 29 తేదీ వైసిపి అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ వేస్తున్నారని.. ఆ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నామినేషన్‌కు తరలివచ్చి పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలకు సహరించాలన్నారు. 
 
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని.. ప్రచారం ఆ విధంగా కొనసాగించాలంటున్నారు. 5 లక్షలకు పైగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. గతంలో వైసిపి అభ్యర్థికి 2 లక్షల 70 వేల మెజారిటీ వచ్చిందని.. కానీ ఆ మెజారిటీ కన్నా డబుల్‌గా రావాలన్నారు సుబ్బారెడ్డి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments