పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిమ్మగడ్డ చెప్పినట్లుగా పనిచేస్తే వారిపై చర్యలు తప్పవు. వారిని బ్లాక్ లిస్టులో పెడతాం. అంతేకాదు మార్చి 31వ తేదీ తరువాత వారిపై చర్యలు ఉంటాయి. ఇది ఎవరో కాదు సాక్షాత్తు కేబినెట్ హోదాలో ఉన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు.
ఈ వ్యాఖ్యలు కాస్త పెద్ద చర్చకే దారితీసింది. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకు వార్నింగ్ ఇస్తే ఈరోజు టిటిడి ఛైర్మన్, వైసిపిలో సీనియర్ నేతగా ఉన్న వై.వి.సుబ్బారెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కొంతమంది టిడిపికి సపోర్ట్ చేస్తున్నారు.
వారెవరో మాకు తెలుసు. వారి పేర్లు మా దగ్గర ఉన్నాయి. అలాంటి వారిపై చర్యలు తప్పవు. సక్రమంగా పనులు చేయండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వై.వి.సుబ్బారెడ్డి. టిడిపి మద్ధతుదారులకు సపోర్ట్ చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టిడిపి మద్ధతుదారులకు పోలీసులే సపోర్ట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.