Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ముఖం పెట్టుకుని వచ్చినవ్.. ఏం చేశావనీ నీక ఓటేయాలి.. తెరాస మాజీకి షాక్...

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంలో స్థానికులు చుక్కలు చూపుతున్నారు. నాలుగేళ్ళ తర్వాత గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతుండటంతో నాయకులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (10:26 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంలో స్థానికులు చుక్కలు చూపుతున్నారు. నాలుగేళ్ళ తర్వాత గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతుండటంతో నాయకులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
"మా గ్రామానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర వేర్చలేదు. మళ్లీ ఓట్లు అడగనీకి ఏ ముఖం పెట్టుకుని వచ్చినవ్‌? అసలు ఏం చేశావని నీకు ఓటేయాలి" అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామస్తులు టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని నిలదీశారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి శనివారం దోతిగూడెంలో పర్యటించారు. 'పిలాయిపల్లి కాలువ లిఫ్ట్‌ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని గ్రామానికి వచ్చిన ప్రతిసారి చెబుతున్నారు.. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ నీరు రాలేదు' అని పైళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
గ్రామంలో సీసీ రోడ్లు లేవని, డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందని, తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని వాపోయారు. ప్రజలు పైళ్ల ను ప్రశ్నిస్తున్న క్రమంలోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 1

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments