Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ, మంగళగిరికి రాకుండానే కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య రవాణా మార్గం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (09:58 IST)
విజయవాడ, మంగళగిరిలలోనికి రాకుండానే కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య రవాణా మార్గం ఏర్పాటు అవుతుందని కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. విజ‌య‌వాడ‌లోని స్వ‌రాజ్య‌మైదానంలో డా. బాబాసాహెబ్ అంబేడ్క‌ర్ స్మృతివనం ఏర్పాటుకోసం కార్యాలయాల తరలింపు వేగవంతం చేస్తున్నామని కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు.

అంబేద్కర్ స్మృతివనం నిర్మించే ప్రాంతంలోని ఇరిగేషన్ కార్యాలయాలను నూతన భవనాల్లోకి తరలిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన భవనంలోనికి ఇరిగేషన్ శాఖకు సంబందించిన చీఫ్ ఇంజనీర్, సూపెరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తరలి వెళుతున్నాయన్నారు. నెలాఖరు నాటికీ కార్యాలయాల‌న్నీ తరలిస్తామ‌న్నారు.

ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన కార్యాలయాలు స్టేట్ గెస్ట్ హౌస్ లోని కార్యాలయాల సముదాయంలోకి  తరలించడం జరిగిందన్నారు. ముక్త్యాలలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ లిమిటెడ్ వారి కార్యాలయం సొంత భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించడం జరిగిందన్నారు.

ఇబ్రహీంపట్నంలో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ లిమిటెడ్ వారికి ఫెర్రీ  టెర్మినల్ ఏర్పాటు చేసేందుకు 3.5 ఎకరాల స్థలం  కేటాయించామని, సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.  ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కొత్త టెర్మినల్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు.

ఈ ఫెర్రీ ద్వారా షుమారు 1500 టన్నులు నదీ మార్గాన  రవాణాకు వీలుకలుగుతుందన్నారు.  విజయవాడ, మంగళగిరిలలోనికి రాకుండానే కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్య రవాణా మార్గం ఏర్పాటు అవుతుందని,  ఖర్చుతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ఫెర్రీ ఏర్పాటుతో నదికి రెండువేపులా సరుకుల రవాణాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments