Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి), ఐడిఎస్ ఇన్కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్టు ఆసంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి,  ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

లింక్డిన్ రీసెర్చ్ ప్రకారం మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదటి స్థానం, క్లౌడ్ ఆర్కిటెక్ట్ రెండో స్థానంలో ఉన్నాయని.. ఇలాంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో మన యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మరింత సులువుగా పొందే అవకాశం ఉంటుందన్నారు.

ఈ ఉద్దేశ్యంతోనే ఎపిఎస్‌ఎస్‌డిసి అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభిస్తోందని వారు తెలిపారు. అమెజాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ 36 గంటలు, బ్లాక్ చైన్ టెక్నాలజీపై 40ల గంటలపాటు ఆన్ లైన్ శిక్షణ ఇస్తారు.

క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రోగ్రామ్ నేర్చుకునేందుకు సీఎస్ఈ, ఐటి, ఈసీఈలో ఎంటెక్, బీటెక్ పాసైనవారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఆన్ లైన్ శిక్షణ కోసం సీ.ఎస్.ఈ, ఐ.టి విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు అర్హులు.

ఆసక్తి ఉన్నవారు ఈనెల 9వ తేదీ సాయంత్రంలోపు www.apssdc.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ప్రొఫెసర్ డి.వి.రామకోటి రెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు ఎపిఎస్‌ఎస్‌డిసి టోల్ ఫ్రీ నంబర్ 18004252422కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments