Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:22 IST)
సామాన్యుడికి టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. టమోటా ధరలు పెట్రోల్ ధరలను దాటేశాయి. పెరుగుతున్న ధరల కారణంగా టమోటాలను కొనడం మానేశారు. ఏపీలో కిలో టమాటా గరిష్ఠంగా రూ.130 పలికింది. బుధవారం నుంచి సగటున కిలో టమాటా రూ.104కు అమ్ముడవుతోంది. టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టమాట చట్నీకి రాంరాం చెప్పారు.
 
పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాటా రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. 
 
భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటాల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు వేరే కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.
 
మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో కర్నూలు జిల్లాలో టమోటాలకు డిమాండ్‌ పెరిగిందని ఉద్యానవనశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీహెచ్‌) బీవీ రమణ తెలిపారు. 
 
రైతులు పండించిన పంటలకు ఇంత ఎక్కువ ధర లభించడం ఇదే తొలిసారి. అయితే టమోటా రైతులు పండించిన పంటకు నమ్మశక్యం కాని ధర లభించడం పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం.
 
కర్నూలులో పత్తికొండ, మద్దికెర, పీపల్లీ‌, ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, ధోనే, కోడుమూరు మండలాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఈ మండలాల్లో 15,000 నుంచి 16,000 హెక్టార్లలో పంట సాగైంది. 
 
మూడు నెలల క్రితం కనీసం కనీస మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో గిట్టుబాటు ధర లేక పలు సందర్భాల్లో రైతులు టమోటాలను రోడ్లపై పారబోశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments