Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారిగా పడిపోయిన టమోటా ధర

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (17:52 IST)
దేశ వ్యాప్తంగా టమోటా ధర రికార్డు స్థాయికి చేరింది. విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అన్ని రకాల కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో ఇతర కూరగాయల కంటే టమోటా ధర పెట్రోల్ రేటును దాటిపోయింది. అనేక ప్రాంతాల్లో కిలో టమోటా ధ రూ.130 నుంచి రూ.150 వరకు పలికింది. 
 
అయితే, ఇతర ప్రాంతాల్లో టమోటా ధర ఎలా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లా మార్కెట్‌లో మాత్రం దీని ధర ఒక్కసారిగా పడిపోయింది. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో టమోటా ధర రూ.20కి పడిపోయింది. 30 కేజీల టమోటా పెట్టె ధర రూ.600గా పలికింది. రెండు రోజుల క్రితం ఇదే మార్కెట్‌లో 30 కేజీల టమోటా ధర ఏకంగా రూ.3 వేల వరకు రికార్డు స్థాయి ధర పలికింది. 
 
ఇపుడు కేవలం 600 రూపాయలు మాత్రమే పలుకుతోంది. దీనికి కారణం మార్కెట్‌కు వచ్చే టమోటా లారీల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. స్థానికంగా కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ మార్కెట్‌కు టమోటా లోడులతో వచ్చే లారీ సంఖ్య అధికంగా వుంది. దీంతో ఈ ధర ఒక్కసారిగా పడిపోయింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments