Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా పోరు : చంద్రబాబుకు టాలీవుడ్ సంఘీభావం

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో చేస్తున్న పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ తన సంఘీభావాన్ని తెలిపింది.

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (14:52 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో చేస్తున్న పోరాటానికి తెలుగు చిత్ర పరిశ్రమ తన సంఘీభావాన్ని తెలిపింది. ఇదే విషయంపై శుక్రవారం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో సమావేశమై సంపూర్ణ మద్దతను ప్రకటించారు. 
 
ఇటీవల చంద్రబాబు సారథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెల్సిందే. ఈ సమావేశానికి వైకాపా, జనసేన, బీజేపీలు దూరంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమావేశంలో వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. 
 
అఖిలపక్షం పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఏప్రిల్ 6వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. సీఎంతో సమావేశమైన వారిలో కెఎల్.నారాయణ, జీకే, సి.అశ్వినీదత్, కె.ఎస్ రామారావుతో పాటు టి.వెంకటేశ్వరరావు, కె.రాఘవేంద్రరావు, జెమిని కిరణ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments