హోదా కోసం పవన్ పవర్‌ఫుల్ ఐడియా.. ఏంటో చూడండి...
ప్రత్యేక హోదా కోసం జనసేనాని దీక్షకు దిగబోతున్నారా? దీనికోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారా? రాయలసీమ వేదికగా వామపక్షాలను కలుపుకుని హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? టిడిపి, బిజెపిల బంధానికి గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా
ప్రత్యేక హోదా కోసం జనసేనాని దీక్షకు దిగబోతున్నారా? దీనికోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారా? రాయలసీమ వేదికగా వామపక్షాలను కలుపుకుని హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? టిడిపి, బిజెపిల బంధానికి గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం సిపిఐ, సిపిఎంలతో పాటు లోక్ సత్తా పార్టీ నేతలతో కలిసి జిల్లాల వారీగా పర్యటనలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అనంతపురం, కాకినాడ, వైజాగ్‌లలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు వచ్చే లాభాలను వివరిస్తూ ముందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్.
జిల్లాల పర్యటనలను ముగించుకుని అనంతపురం జిల్లాలో ఆమరణ దీక్ష చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలపడుతుందని, హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలిపేందుకు ఆమరణ నిరాహారదీక్ష బ్రహ్మాస్త్రంగా నిలబడుతుందనే భావనతో పవన్ ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచే ప్రత్యేక హోదాతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అక్కడి నుంచే ఆమరణ దీక్ష చేస్తే ఎలా ఉంటుందని కొంతమంది సీనియర్లతో స్వయంగా పవన్ కళ్యాణ్ చర్చించారట.
మరో 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్షకు కూర్చునే అవకాశం ఉందని జనసేన పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇదే జరిగితే ఖచ్చితంగా ఎపిలోని అన్ని పార్టీలు పవన్‌కు మద్దతివ్వడమే కాకుండా హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.