Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో భర్తకు వివాహం చేయించిన భార్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (14:04 IST)
కట్టుకున్న భర్త.. పరాయి స్త్రీని కన్నెత్తి చూస్తేనే సహించలేని ఈ కాలంలో ఓ మహిళ ఏకంగా తన భర్తకు ఆయన ప్రియురాలితో వివాహం చేయించిందో మహిళ. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జరిగింది. స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుపతి పట్టణంలోని అంబేద్కర్ నగరుకు చెందిన ఓ యువకుడు టిక్ టాక్‌లో రాణిస్తున్న సమయంలో విశాఖకు చెందిన యువతితో పరిచయమేర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ చనువుగా ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. 
 
అయితే, టిక్‌టాక్‌లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 
 
వీరి కుటుంబం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయం విశాఖ అమ్మాయి మళ్లీ లైన్లోకి వచ్చింది. ప్రియుడికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఆమె బాధపడింది. ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురం కలిసి ఉందామని ప్రియుడి భార్యతో చెప్పింది. 
 
ఈ మాట విన్న భార్య ముందు షాక్ తిన్నా.. తర్వాత ముగ్గురూ కలిసి ఉండేందుకు అంగీకరించింది. బుధవారం దగ్గరుండి తానే తన భర్తకు, ఆయన ప్రియురాలికి పెళ్లి జరిపించింది. పెళ్లి కూతురుని కూడా ఆమె స్వయంగా అలంకరించింది. ఈ విషయం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments