Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాయ్ - బిస్కెట్స్ అంటూ స్నాక్స్ రూపంలో రూ.3 కోట్లు బొక్కేసిన వైకాపా నేతలు.. ఎక్కడ?

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (10:28 IST)
గత ఐదేళ్ల కాలంలో వైకాపా ప్రభుత్వ పాలకులు చేయని దోపిడీ అంటూ లేదు. అధికారంతో, అధికారుల అండతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, మైన్స్ స్కామ్ ఇలా అనేక రకాలుగా వారు కుంభకోణాలకు పాల్పడ్డారు. తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగు చూసింది. చాయ్, బిస్కెట్స్ పేరుతో స్నాక్స్ స్కామ్‌కు పాల్పడ్డారు. తిరుపతి మున్సిపాలిటీ ఈ స్కామ్ పేరుతో ఏకంగా రూ.3 కోట్లను అక్రమంగా బొక్కేశారంటూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినట్టు వైసీపీ కార్పొరేటర్లే నిర్ధారించారని వెల్లడించారు.
 
'మనం మామూలుగా ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్ ఇలాంటి చూశాం... కానీ ఇక్కడ స్నాక్స్ స్కామ్ జరిగింది. ఇలాంటి స్కామ్ మొదటిసారి చూస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్‌లో అంతా కలిపి 150 మంది ఉంటారు. వారికి అందించే స్నాక్స్ ప్యాకెట్‌లో ఒక సమోసా, కొన్ని జీడిపప్పులు, కొంత మిక్చర్, ఒక బిస్కెట్ ఉన్నాయి. ఒక చిన్న కప్పులో టీ ఇస్తారు. దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లే బహిరంగంగా చెప్పారు. ఆ టీలో ఏమైనా బంగారు పూత పూశారా? మున్సిపాలిటీ అధికారులేమో రూ.3 కోట్లు కాదు... రూ.38 లక్షలకే తిన్నాం అంటారు, మరో అధికారేమో రూ.1.50 కోట్లకే తిన్నాం అంటారు. స్వయానా వైసీపీ కార్పొరేటర్లే బయటికి వచ్చి రూ.3 కోట్ల స్నాక్స్ అని చెప్పారు' అని వివరించారు.
 
ఇక కార్పొరేషన్ పరిధిలో 90 మంది ఉద్యోగులను నియమించి, వారికి 25 నెలల పాటు జీతాలు చెల్లించినట్టు రికార్డులు తయారుచేశారని, ఆ నిధులను మళ్లించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. "ఆ ఉద్యోగులందరూ ఎక్కడున్నారో తెలుసా...? హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో పనిచేసే అధికారుల ఇళ్లల్లో ఇద్దరు చొప్పున పనివాళ్లు ఉన్నారు. వాళ్లతో ఇళ్లలో పనులు చేయించుకుని ప్రభుత్వ డబ్బు జీతాలుగా ఇచ్చారు. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు... ప్రజల డబ్బుతో జల్సాలు చేశారు" అంటూ కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. అంతేకాదు, గతంలో రూ.2 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను కూడా మూలనపడేశారంటూ వైకాపా పాలకులు చేసిన పాపాలను ఆయన ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments