అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

ఠాగూర్
ఆదివారం, 5 అక్టోబరు 2025 (09:58 IST)
సొంత కుమార్తె భర్తను పెళ్లి చేసుకునేందుకు కన్నతల్లి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తె కన్న తల్లి ప్రయత్నాన్ని అడ్డుకుంది. దీంతో కుమార్తెపై పగబట్టిన తల్లి... అల్లుడుతో కలిసి కుమార్తెను హత్య చేసేందుకు యత్నించింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ గ్రామానికి చెందిన బాలుడు (18), బాలిక (15)లు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆమెకు అల్లుడుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శుక్రవారం రాత్రి తన అల్లుడు అతని భార్య పక్కన ఉన్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అత్త.. అల్లుడుతో మెడలో తాళి కట్టించుకునేందుకు ప్రయత్నించింది. 
 
దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుమార్తె తన భర్త చర్యను అడ్డుకుంది. తన తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త కలిసి బాధితురాలిపై దాడికి దిగారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగువారు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలికను కాపాడారు. అత్త, అల్లుడుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments