Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. సినిమా టైటిల్ కాదు... దొంగల ముఠా

అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. ఇదేదో ఓ తెలుగు సినిమా టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మూడు తరాలుగా దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా. ఈ ముఠా పాపం ఇప్పటికి పండింది.

Tirupati
Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (10:50 IST)
అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. ఇదేదో ఓ తెలుగు సినిమా టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మూడు తరాలుగా దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా. ఈ ముఠా పాపం ఇప్పటికి పండింది. ఫలితంగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 6.42 లక్షల నగదుతో పాటు బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
తిరుపతి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తులసి అలియాస్‌ నిర్మల అలియాస్‌ సయ్యద్‌ రషీద్‌ బేగం(58), ఎం.లక్ష్మి అలియాస్‌ మీరున్నిషా(35), ఎం.సోనీ అలియాస్‌ రిజ్వాన(19)... అవ్వ, అమ్మ, మనవరాలు. వీరి సొంతూరు హైదరాబాద్‌లోని అంబర్‌పేట. ఎక్కడ దొంగతనం చేయాలన్నా ముందుగా ఖరీదైన దుస్తులు వేసుకుని, స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పనిపూర్తిచేసి అక్కడ నుంచి జారుకుంటారు. 
 
ఇలా హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాలు, తిరుపతి, తిరుచానూరు ఇతర నగరాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను అపహరించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే ముగ్గురూ కలిసి తిరుపతి వచ్చారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మెట్లపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వీరి గురించి సమాచారం రావడంతో సీఐ పద్మలత బృందం అదుపులోకి తీసుకుంది. వీరిపై ఏపీ, తెలంగాణల్లో 100కు పైగా కేసులున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments