Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేసినట్టు రువుజు చేసి ఈ చెప్పుతో కొట్టండి : పృథ్వీ రాజ్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (18:05 IST)
తాను తప్పు చేసినట్టు రుజువైతే ఈ చెప్పుతో కొట్టండి అంటూ సినీనటుడు, వైకాపా నేత, తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ గిరికి రాజీనామా చేసిన పృథ్వీ రాజ్ అన్నారు. రైతులంటే బురదలో ఉంటారనీ, బంగారు గాజులు వేసుకుని మొబైల్ ఫోన్స్ చేతబట్టుకుని ఉండరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పృథ్వీరాజే ఎస్వీబీసీ ఛానెల్‌లో పని చేసే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన వీడియో లీక్ కీవడంతో రాసలీలల బురదలో చిక్కుకుని ఛైర్మన్ పదవిని కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించాడు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని చెప్పాడు. తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments