Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిపిఐ నారాయ‌ణ కాలికి... ఎంపీ గురుమూర్తి మ‌సాజ్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:19 IST)
పెద్ద‌లు క‌నిపిస్తే, కాళ్ళ‌కు న‌మ‌స్కారం చేస్తారు. కానీ ఇలా ప్ర‌తిప‌క్ష నేత కాళ్ళు ప‌ట్టుకున్నారేంటని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అదీ సీపీఐ నేత కాళ్ళు, అధికార వైసీపీ నేత ప‌ట్టుకోవ‌డం ఏంట‌ని అపార్ధం చేసుకుంటున్నారా? అదేం లేదండి... ఇది చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న‌అరుదైన సన్నివేశం. 

 
తిరుపతి రూరల్ మండలం రాయలచెరువు పరిశీలనకు వచ్చిన సిపిఐ నారాయణ కాలికి గాయమైంది. దీంతో అక్కడ వైసీపీ నేతలు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆయ‌న‌కు ఏదైనా ప్రాథ‌మి చికిత్స చేయాల్సి వ‌చ్చింది. ఫిజియోథెరపిస్ట్ కూడా అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి నారాయణ కాలికి ప్రథమ చికిత్స చేశారు. నారాయణ కాలును తన తొడ పై పెట్టుకుని మ‌రీ కట్టు కట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ వైసిపి నేతలైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇతర నేతలతో సరదాగా ముచ్చటించారు. ఎప్పుడూ వైసిపి నేతలపై అంత ఎత్తున లేచిపడే సీపీఐ నారాయణ వారితో జోకులు వేస్తూ, సరదాగా గడపడం అంద‌రికీ ఆసక్తిని క‌లిగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments