Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (09:00 IST)
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై వసతి గృహంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గత నాలుగేళ్ల పాటు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాలికపై జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వ బాలికల వసతి గృహంలో  బాలికపై దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ సూపరింటెండెంట్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
కడప జిల్లాకు చెందిన బాలిక 2012లో ఉన్నత విద్య కోసం తిరుపతిలోని షెల్టర్ హోంలో చేరింది. ఆమె తల్లి చనిపోగా, ఓ కేసులో తండ్రి జీవిత శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆమెను వసతి గృహానికి తరలించారు. ఆశ్రయం కోసం వచ్చిన బాలికను సూపరింటెండెంట్ వాడుకున్నాడు.
 
చిన్నారిని చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా, రాత్రుళ్లు తన గదికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక నిరాకరిస్తే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ ఏడాది అక్టోబరు 27న బాలికను కడప వసతి గృహానికి అధికారులు బదిలీ చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్న బాధిత చిన్నారి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్‌ శివకామినిని కలిసి నందగోపాల్ అకృత్యాలను బయటపెట్టింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments