Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం.. అర్థరాత్రి.. ప్రియురాలి సంతానం అడ్డు.. చంపేశాడు..

Advertiesment
వివాహేతర సంబంధం.. అర్థరాత్రి.. ప్రియురాలి సంతానం అడ్డు.. చంపేశాడు..
, శనివారం, 3 నవంబరు 2018 (19:07 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆధునికత పెరిగే కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారంటూ.. ప్రియురాలి ఇద్దరు పిల్లలను ఓ ప్రియుడు దారుణంగా హత్యచేసి పాతిపెట్టాడు. ఈ ఘటన పుట్టపర్తి మండలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన ఓబులేసు బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అక్కడే పనిచేసే గణేశ్ అనే వ్యక్తితో ఆరు నెలల క్రితం పరిచయమైంది. గణేశ్ భార్య నాగమ్మ కూడా అక్కడే హెల్పర్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇంతలో నాగమ్మతో ఓబులేసుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజు వివాహం చేసుకుంటానని నమ్మించి నాగమ్మను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. 
 
తన భార్య రాములమ్మకు పరిచయం చేసి నాగమ్మను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దీనికి భార్య అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఇంట్లో ఉంచేందుకు అంగీకరించకపోవడంతో ఐదు రోజుల క్రితం పుట్టపర్తిలోని ఓ లాడ్జిలో నాగమ్మ, ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. కానీ తమ సంబంధానికి నాగమ్మ ఇద్దరు పిల్లలు అడ్డంగా వున్నారని భావించిన ఓబులేసు అక్టోబర్ 26న అర్థరాత్రి వారిని హతమార్చి.. హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చేశాడు. 
 
ఉదయం నిద్రలేచిన తర్వాత తన పిల్లలు ఎక్కడని నాగమ్మ ప్రశ్నించడంతో... ఇక్కడ మనకు అడ్డుగా వున్నారని బంధువుల ఇంట్లో వదిలి వచ్చినట్లు చెప్పాడు. కానీ పిల్లల గురించి ఏం అడిగినా ఓబులేసు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. నాగమ్మ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారించాడు. దర్యాప్తులో అతడే పిల్లలను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు పిల్లల మృతదేహాన్ని గుర్తించి పోస్టు మార్టానికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక నావల్ల కాదు... నాపై పెట్టిన డబ్బంతా తిరిగి ఇచ్చేస్తానన్నా: రజినీకాంత్