Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం

Webdunia
గురువారం, 5 మే 2022 (09:47 IST)
గత యేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత ఐదు నెలలుగా కొనసాగిన మరమ్మతు పనులు తితిదే అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మార్గాన్ని గురువారం నుంచి భక్తుల కోసం ప్రారంభించనున్నారు. ఇందుకోసం నిర్వహించే ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆయన గురువారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. 
 
కాగా, గత యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ మెట్లమార్గం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీనికి ఐదు నెలలుగా మరమ్మతులు చేపట్టారు. తిరుమలకు నడిచి వెళ్లేందుకు భక్తులు అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేసేందుకు రూ.3.60 కోట్లను తితిదే ఖర్చు చేసింది. 
 
800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్ఠంగా నిర్మించారు. గురువారం ఈ మార్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఇప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments