Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి పాదాల మండపం ఓకే, మరి శ్రీవారి మెట్లు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (20:24 IST)
భారీ వర్షాల కారణంగా తిరుమలలో జరిగిన డ్యామేజ్ అంతాఇంతా కాదు. సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు టీటీడీ చైర్మన్ స్వయంగా వెల్లడించారు. తిరుమల కాకుండా తిరుపతిలోనూ టీటీడీకి సంబంధించిన ఆస్తులు నష్టానికి గురైనట్లు తెలిపారు.

 
ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలి బాటన భక్తులు తిరుమల వెళ్తుంటారు. మొక్కులు సమర్పించుకునేందుకు కాలిబాటన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి శ్రీవారి మెట్లు ప్రస్తుతం వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి.

 
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లేందుకు మొత్తం రెండు కాలిబాట మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి పాదాల మండపం.. మరొకటి శ్రీవారి మెట్టు. రెండు మార్గాలలో ప్రస్తుతం టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.

 
అయితే శ్రీవారి మెట్టు మార్గంలోని 200, 500, 800వ మెట్టు వద్ద మెట్లు చాలావరకు కొట్టుకుపోయాయి. దీంతో మరమ్మతులు చేయడం చాలా కష్టతరంగా మారుతోంది. అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాట మార్గాన్ని మాత్రం తాత్కాలికంగా యుద్ధప్రాతిపదికన సిద్ధం చేశారు.

 
రేపటి నుంచి అలిపిరి పాదాల మండపంను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. శ్రీవారి మెట్లు మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అలిపిరి పాదాల మండపం అందుబాటులో ఉంచిన భక్తులు సులువుగా వెళ్ళేది శ్రీవారి మెట్ల మార్గం కాబట్టి ఆ మార్గంలో త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments