Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు విజ్ఞప్తి, తిరుమలకు రావద్దండి, వచ్చిన వారు పడుతున్న కష్టాలు..?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (13:59 IST)
పర్వదినాలు వచ్చాయంటే చాలు తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంటుంది. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పాటు జనంలో కరోనా భయం పూర్తిగా పోవడంతో ఆలయాలకు భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.
 
అయితే తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం సామాన్యులకు దొరకడం కష్టతరంగా మారుతోంది. అది కూడా జనవరి 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం దొరకడం కష్టతరంగా మారుతోంది. సాధారణంగా టిటిడి ఇచ్చే సర్వదర్సనం టోకెన్లు ఉన్నఫలంగా అయిపోయాయి. తిరుపతిలోని విష్ణునివాసం, అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ లలో టిటిడి సర్వదర్సనం టోకెన్లను అందిస్తోంది. 
 
విష్ణునివాసంలో అయితే 24 గంటల పాటు టోకెన్లను అందిస్తోంది. అయితే వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నాలుగురోజుల పాటు ఇవ్వాల్సిన టిక్కెట్లన్నీ ఒకేసారి అయిపోయాయి. అది కూడా ఆదివారం ఒక్కరోజే భక్తులు టోకెన్లను తీసేసుకున్నారు. 
 
21, 22, 23, 24 తేదీలకు సంబంధించిన టోకెన్లన్నీ పూర్తయిపోయాయి. ఇక టోకెన్లు ఇవ్వలేమని టిటిడి అధికారులు తేల్చేశారు. కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయం తెలియని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకుంటుండడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి.
 
టోకెన్ కేంద్రాల వద్ద భక్తులు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. రోడ్డుపైనే వంటలు చేసుకుని తింటున్నారు. టోకెన్లు ఇవ్వలేమని టిటిడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నా సరే పట్టించుకోవడం లేదు భక్తులు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నాం.. దర్శనం చేసుకునే వెళుతామంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు భక్తులు. టిటిడి అధికారులు మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కౌంటర్లన్నీ నిర్మానుష్యంగా ప్రస్తుతం దర్సనమిస్తున్నాయి. 
 
జనవరి 3వతేదీ వరకు సర్వదర్సనం టోకెన్లను ఇవ్వరు. ఇప్పటికే 24వతేదీ వరకు టోకెన్లను మంజూరు చేసేశారు. ఇక 24వతేదీ నుంచి ఇచ్చే టోకెన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లే. అది కూడా స్థానికులకు మాత్రమే టిటిడి టోకెన్లను జారీ చేయనుంది. స్థానికేతరులకు వైకుంఠ ఏకాదశి టోకెన్లను ఇవ్వమని ఇప్పటికే టిటిడి అధికారులు తేల్చేశారు.
 
ఆన్ లైన్ లో 2లక్షల టోకెన్లను వైకుంఠ ఏకాదశికి సంబంధించి విడుదల చేశారు. పదిరోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్సనాన్ని భక్తులకు కల్పించబోతున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్టు ద్వారా కూడా 20వేల టిక్కెట్లను టిటిడి అందించింది. దీన్ని బట్టి ప్రతిరోజు 30వేల మందికి మాత్రమే దర్సనం చేయించగలమని టిటిడి స్పష్టం చేస్తోంది. అంతకు మించి అయితే దర్సనం చేయించలేమని..కోవిడ్-19 నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments