Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్థానికేతరులకు వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ఇవ్వబడవు: ధర్మారెడ్డి

స్థానికేతరులకు వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ఇవ్వబడవు: ధర్మారెడ్డి
, శనివారం, 19 డిశెంబరు 2020 (14:36 IST)
గత ఆరునెలల్లో ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ ఇన్పెక్షన్ కాకుండా కాపాడగలిగామన్నారు తిరుమల టిటిడి ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి. ప్రతిరోజు 300 మంది భక్తులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. టిటిడి ఉద్యోగుల్లో కోవిడ్ కేసులే లేవన్నారు. తిరుపతిలో టిటిడి ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించారు టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి.
 
నిబంధనలు గట్టిగా పాటించడం వల్ల తిరుమల, తిరుపతిలలో కోవిడ్‌ను అరికట్టగలిగామని చెప్పిన ధర్మారెడ్డి.. ఆన్ లైన్ శీఘ్రదర్సనం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్సనానికి ఒకే రోజు 2 లక్షల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్లు చెప్పారు. సర్వదర్సనం టోకెన్లు స్థానికులకు మాత్రమే రండి.. స్థానికేతరులు దయచేసి రావద్దని విజ్ఞప్తి చేశారు. 
 
శ్రీవాణి ట్రస్టు ద్వారా పదిరోజులకు సరిపడా ప్రతి రోజు 2 వేల టిక్కెట్లు ఇస్తామనీ, ఈ నెల 24వతేదీ నుంచి ప్రతిరోజు స్థానికులకు 8వేల టిక్కెట్లు ఇస్తామన్నారు. తిరుపతి లోని ఐదు కౌంటర్లలో టోకెన్లను భక్తులు పొందవచ్చన్నారు. తిరుమలలో ప్రతిరోజు 30 నుంచి 35 వేల మంది భక్తులకు మాత్రమే దర్సనం చేయించగలమని.. అంతకు మించి భక్తులకు దర్సనం చేయించలేమని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ భూభాగంపై భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్.. ఖురేషి సంచలన ఆరోపణలు