Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల లడ్డూ నో సేల్స్, నో మనీ: ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా?

Webdunia
గురువారం, 27 మే 2021 (18:10 IST)
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై పడింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రాకపోవడంతో లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా అంతే స్థాయిలో తగ్గిపోయాయి. దీంతో శ్రీవారి ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కూడా అమాంతం తగ్గిందట. ఈ యేడాది 375 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిన టిటిడి అంచనాలు తప్పేలా ఉన్నాయి.
 
కరోనా విజృంభిస్తుండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఎఫెక్ట్ కాస్త లడ్డూ విక్రయాలపై పడింది. లడ్డూ విక్రయాలు లేక కౌంటర్లన్నీ వెలవెలబోతున్నాయి. తిరుమల శ్రీనివాసుడి దర్సనానికి వచ్చే భక్తులు స్వామివారి దర్సనం తరువాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది శ్రీవారి లడ్డూకే.
 
తిరుమలకు వెళ్ళి వచ్చామంటూ బంధుమిత్రులకు లడ్డూ పంచాల్సిందే. దీంతో భక్తులు లడ్డూప్రసాదాన్ని అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తుంటారు. కరోనా రాక ముందు నిత్యం 60 వేల నుంచి లక్షమంది భక్తులు తిరుమలకు వచ్చేవారు. లడ్డూ విక్రయాలు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండేది. 
 
గతంలో లడ్డూపై సబ్సిడీ ఇస్తుండగా దీన్ని తొలగించారు. 2019-20లో ప్రసాదాల ద్వారా 330 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 లడ్డూ విక్రయాల ద్వారా 375 కోట్ల  రూపాయలు ఆదాయం వస్తుందని టిటిడి అంచనా వేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో టిటిడి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 
 
లడ్డూ ప్రసాదాల విక్రయాలు అంతంతమాత్రంగా మారింది. ఆదాయం మరింత తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈ స్ధాయిలో పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు టిటిడి అధికారులు. లడ్డూ నిల్వలు కూడా అలాగే ఉండిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments