Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహ అమ్మకాల పరంగా అత్యధికంగా 39% వృద్ధి నమోదుచేసిన హైదరాబాద్‌

Advertiesment
గృహ అమ్మకాల పరంగా అత్యధికంగా 39% వృద్ధి నమోదుచేసిన హైదరాబాద్‌
, శుక్రవారం, 21 మే 2021 (22:29 IST)
భారతదేశంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాలలో, హైదరాబాద్‌లో అత్యధికంగా గృహ విక్రయాలు జనవరి- మార్చి నడుమ జరిగాయి. ఈ వృద్ధి గరిష్టంగా 39% ఉంది. కోవిడ్‌ 19 మహమ్మారి పరిస్థితులలో సైతం వినియోగదారుల నుంచి అత్యధిక డిమాండ్‌ ఈ నగరంలో కనిపిస్తుంది అని ఇటీవలనే సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ విడుదల చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
 
ఈ హైటెక్‌ నగరంలో అతి తక్కువగా ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ ఉంది (అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ విక్రయించేందుకు పట్టే కాలం). నూతన సరఫరా గణనీయంగా పెరిగినప్పటికీ 25 నెలల కాలం ఈ విక్రయాలకు పడుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా, హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ ప్రోపర్టీ మార్కెట్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోవడంతో ప్రభావితమైంది. అయినప్పటికీ అమ్మకాలు, ఆవిష్కరణలు, ధరల పెరుగుదలపరంగా స్థిరంగా వృద్ధి కొనసాగిస్తుంది. 2021 క్యాలెండర్‌ సంవత్సర తొలి త్రైమాసంలో ఈ ధోరణి కొనసాగింది.
 
డిమాండ్‌
ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ ఇటీవలి కాలంలో రియల్‌ ఇన్‌సైట్‌-క్యుసీవై 21 శీర్షికన విడుదల చేసిన అధ్యయనంలో ఐటీ నగరంలో గృహ విక్రయాలు 39% వృద్ధి చెంది 7721యూనిట్లుగా జనవరి-మార్చి కాలానికి నిలిచాయి. 2020 క్యాలెండర్‌ సంవత్సరం జనవరి-మార్చి నడుమ ఈ గృహ విక్రయాలు 5554 యూనిట్లుగా నిలిచాయి.
 
ఈ వృద్ధి చెందిన డిమాండ్‌కు హైదరాబాద్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతాలైనటువంటి సంగారెడ్డి, బాచుపల్లి, కొంపల్లి లాంటి ప్రాంతాలు కారణం. విలువ పరంగా, బిల్డర్లు దాదాపు 8400 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులను క్యు1 2021లో విక్రయించారు.తద్వారా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 34% వృద్ధి నమోదు చేశారు.
 
‘‘వ్యాపార అనుకూల రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అయినటువంటి టీ–ఐ పాస్‌ మరియు ఐసీటీ పాలసీ వంటివి అతి సులభంగా వ్యాపారం నిర్వహించుకునే అవకాశాలను అందిస్తున్నాయి. అది రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది.
 
నూతన ప్రారంభాలు
సరఫరా పరంగా హైదరాబాద్‌లో  నూతన ప్రారంభాలు ఏకంగా 95% వృద్ధి చెంది 7604 యూనిట్లుగా ఈ క్యాలెండర్‌ సంవత్సర మొదటి త్రైమాసంలో నిలిచాయి. హైదరాబాద్‌లోని నల్లగండ్ల, కొంపల్లి ప్రాంతాలలో అత్యధిక ప్రారంభాలు జరిగినట్లుగా గమనించడం జరిగింది. దాదాపు 49% నూతన సరఫరా జనవరి-మార్చి 2021 త్రైమాసంలో 75లక్షల రూపాయలకు పై బడిన ధరలో ఉంది. యూనిట్‌ ధర 45-75 లక్షల రూపాయల ధరలోని యూనిట్ల వాటా 40%గా మొత్తం ఆవిష్కరణలలో నిలిచాయి.
 
2021 మొదటి త్రైమాసంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ గృహాల వాటా 48%గా ఉంటే గత సంవత్సరం ఇదే త్రైమాసంలో ఇది 28% వాటా కలిగి ఉంది. ‘‘క్యాలెండర్‌ సంవత్సరం 2021 మొదటి త్రైమాసంలో హైదరాబాద్‌లోని ప్రైమరీ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ కోవిడ్‌ ముందస్తు నాటి అమ్మకాల సంఖ్యను అధిక మించాయి’’ అని మణి రంగరాజన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌– హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
2020 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసంలో లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు దారుణంగా పడిపోయినప్పటికీ  పండుగ డిమాండ్‌, అతి తక్కువ వడ్డీరేట్లు, స్థిరమైన ధరలు వంటి అంశాల కారణంగా గృహ విక్రయాలు పునరుద్ధరించబడ్డాయి అని ఆయన అన్నారు. గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం మార్చి వరకూ విక్రయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా నమ్మకమైన డెవలపర్ల దగ్గర ఈ విక్రయాలు బాగున్నాయి అని రంగరాజన్‌ వెల్లడించారు. అయితే, ఏప్రిల్‌ నుంచి విక్రయాలు నెమ్మదించాయి. దీనికి ఏప్రిల్‌ తరువాత మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఆరంభం కావడం ఓ కారణం.
 
సెకండ్‌ వేవ్‌ ప్రభావం గురించి ఇప్పుడే చెప్పడం తొందర పాటు అవుతుంది కానీ హౌసింగ్‌ డిమాండ్‌ పునరుద్ధరణపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పగలను అని రంగరాజన్‌ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను తట్టుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ పూర్తిగా సన్నమైందని ఆయన గమనించారు. ‘‘గత సంవత్సర కాలంలో మార్కెటింగ్‌ మరియు విక్రయాల పరంగా డిజిటల్‌ ఉపకరణాల స్వీకరణలో కనిపిస్తోన్న వేగం ప్రోత్సాహకరంగా ఉంది’’ అని ఆయన వెల్లడించారు.
 
అమ్ముడుకాని ఇన్వెంటరీ
నూతన సరఫరా పరంగా గణనీయంగా కనిపిస్తోన్న వృద్ధి కారణంగా అమ్ముడు కాకుండా ఉన్న గృహ స్టాక్‌ నగరంలో 26% ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధి చెంది 39,191 యూనిట్లకు చేరింది. ప్రస్తుత అమ్మకాల విక్రయాల వేగం పరిగణలోకి తీసుకుంటే, అమ్ముడు కాకుండా ఉన్న గృహ యూనిట్ల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలో అతి ప్రధానమైన ఎనిమిది నగరాలలో హైదరాబాద్‌లో మాత్రమే అతి తక్కువగా ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ 25 నెలలు కనిపిస్తుంది. అంటే ఈ నగరంలో తమ వద్ద అమ్ముడు కాకుండా ఉన్న ఇన్వెంటరీ విక్రయాలకు బిల్డర్లకు రెండు సంవత్సరాల మీద ఒక నెల ఎక్కువ పడుతుందని అర్ధం. దేశంలోని ఎనిమిది నగరాలలో ఈ అమ్ముడుకాకుండా ఉన్న గృహాలు విక్రయించడానికి సరాసరిన నాలుగు సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్‌ మినహాయించి మిగిలిన నగరాలలో సరాసరిన 3నుంచి 5 సంవత్సరాలు పడుతుంది.
 
టిక్కెట్‌ సైజ్‌ మరియు యూనిట్‌ కాన్ఫిగరేషన్‌ ఆధారంగా డిమాండ్‌ విశ్లేషణ:
విభిన్నమైన ధరల వద్ద డిమాండ్‌ను విశ్లేషించినప్పుడు తమ అధ్యయన నివేదిక వెల్లడించిన దాని ప్రకారం 2021 క్యాలెండర్‌ సంవత్సరం తొలి త్రైమాసంలో మొత్తం అమ్మకాలలో  54% తోడ్పాటును 75 లక్షల రూపాయల పైబడిన ధరలు కలిగిన యూనిట్లు తోడ్పాటునందించాయి. ఇక 45–75 లక్షల రూపాయల నడుమ ధరలు కలిగిన గృహాలు  మొత్తం విక్రయాలలో 31% తోడ్పాటునందించాయి. నమ్మకమైన డెవలపర్ల వద్ద భారీ మరియు నాణ్యత కలిగిన గృహాలను కొనుగోలు చేయాలనే జాతీయ  ధోరణి అనుసరిస్తూ హైదరాబాద్‌ వినియోగదారులు సైతం మూడు బెడ్‌రూమ్‌ల గృహాలను కోరుకుంటున్నారు. మొత్తం విక్రయాలలో 48% తోడ్పాటును 3 బీహెచ్‌కె గృహాలు అందిస్తుంటే, 44% వాటాను 2బీహెచ్‌కె గృహాలు ఆక్రమించాయి
 
ధరల ధోరణి
గృహాల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 5% వృద్ధిని జనవరి–మార్చి 2021 నడుమ నమోదు చేశాయి. కీలక ప్రాంతాలలో వినియోగదారుల నుంచి వస్తోన్న డిమాండ్‌ దీనికి కారణం. రమారమిన నగరంలో చదరపు అడుగును 5713 రూపాయలకు విక్రయిస్తున్నారు.
 
వర్ట్యువల్‌ డిమాండ్‌
హౌసింగ్‌ డాట్‌ కామ్‌ పై నమోదైన డాటాను విశ్లేషించిప్పుడు ఆన్‌లైన్‌ డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందుతున్నట్లు గమనించింది. కొండాపూర్‌, కూకట్‌పల్లి, నిజాంపేట, మియాపూర్‌, కొంపల్లి లలో వినియోగదారుల నుంచి గరిష్ట డిమాండ్‌ ఉంది. 2021 మొదటి త్రైమాసంలో ఈ ధోరణి కనిపించింది.
 
గరిష్టంగా సింగిల్‌ బెడ్‌రూమ్‌ కోసం వెదుకుతుంటే, అనుసరించి డబుల్‌ బెడ్‌రూమ్‌ కనిపిస్తున్నప్పటకీ విక్రయాల పరంగా మూడు బెడ్‌ రూమ్‌ గృహాలకు డిమాండ్‌ అధికంగా ఉన్నట్లు గమనించడం జరిగింది. కొండాపూర్‌, కొంపల్లి, మియాపూర్‌ లాంటి ప్రాంతాలలో 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల నడుమ ధరలలోని గృహ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. కూకట్‌పల్లి, నిజాంపేటలలో 50 లక్షల రూపాయల లోపు గృహాలకు ఎంక్వైరీలు అధికంగా కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్క్ వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా? ఓ వైద్యుడి అభిప్రాయం...