Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోపై వేటు.. కొత్తగా జేఎస్వీ ప్రసాద్ నియామకం?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (13:29 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ సర్కారు బదిలీ చేయనుంది. ఆయన స్థానంలో కొత్తగా సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నియమించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడో రేపో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో ఇప్పటికే సతీశ్ చంద్రను ప్రభుత్వం నియమించి, ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
దీంతో జేఎస్వీ ప్రసాద్‌కు తితిదే బోర్డు బాధ్యతలు అప్పగించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జేఎస్వీ ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఎక్స్ ఆఫీషియో మెంబరుగా కూడా సేవలందించారు. ఇక అనిల్ కుమార్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments