తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది.
1. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది.
2. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.
3. పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
4. పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే ఎటువంటిజలుబైనా వదలి వెళ్ళవలసిందే! తలనొప్పిసగం నయమైపోతుంది.
5. పచ్చ కర్పూరం కుంకుమపువ్వు కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది.
6. వ్యాపారులు ప్రతి రోజు పచ్చ కర్పూరపు కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది.
7. పచ్చ కర్పూరాన్ని తీపి పదార్ధాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే-మీ ఇంట శుభ కార్యాలు త్వరగా జరుగుతాయి.
8. పచ్చ కర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతి రోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంత దుర్గంధం దరిచేరవు.
9. పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మానం గౌరవం ఎక్కువ అవుతుంది.
10. పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య దేవునికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ వుంటే అన్ని రకాల గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది.