Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పొలానికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి.. సజీవ దహనమైంది.. ఎలా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (13:21 IST)
తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ సజీవ దహనమైన విషాద ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు. చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టి తండ్రి వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటున్నాడు.
 
హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments