Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో అర్థరాత్రి రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (09:57 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొని ఓ మహిళతో పాటు ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. వారివద్ద ఉన్న సంచల్లో తితిదే లాకర్ అలాట్మెంట్ టికెట్లు ఉన్నాయి. గూండురు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి వయసు 45 నుంచి 50 యేళ్ళ మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పురుషులు ఇద్దరూ పట్టాలపైనే ప్రాణాలు కోల్పోగా, మహిళ మాత్రం బ్రిడ్జిపై నుంచి కిందపడి చనిపోయింది. 
 
అయితే, పట్టాలపై ఉన్న మహిళను రక్షించే క్రమంలో పురుషులు కూడా ప్రమాదంబారినపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారా? లేదంటే ఇంకెవరైనానా? అనే విషయాలు తెలియాల్సివుంది. ప్రమాద సమయంలో వారి చేతుల్లో ఉన్న సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం లాకర్ అలాట్మెంట్ టిక్కెట్లు ఉన్నాయి. వాటితోపాటు సంచిలో ఉన్న ఫోన్ నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments