ఈ తల్లి హృదయం చూస్తే ఏడుపు ఆగదు?

తల్లిప్రేమకు మరేదీ సాటి రాదంటారు.. కన్నబిడ్డకు ఏమైనా జరిగితే తల్లిడిల్లపోతుంది తల్లి హృదయం. అది మనుషులైనా సరే జంతువులైనా సరే.. ఇక కన్నబిడ్డ కళ్లముందే చనిపోతే ఆ బాధను ఏమాత్రం తట్టుకోలేదు మాతృ హృదయం. ఇలాంటి హృదయ విదారక సన్నివేశం శనివారం తిరుమల ఘాట్ రోడ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (21:34 IST)
తల్లిప్రేమకు మరేదీ సాటి రాదంటారు.. కన్నబిడ్డకు ఏమైనా జరిగితే తల్లిడిల్లపోతుంది తల్లి హృదయం. అది మనుషులైనా సరే జంతువులైనా సరే.. ఇక కన్నబిడ్డ కళ్లముందే చనిపోతే ఆ బాధను ఏమాత్రం తట్టుకోలేదు మాతృ హృదయం. ఇలాంటి హృదయ విదారక సన్నివేశం శనివారం తిరుమల ఘాట్ రోడ్‌లో చోటుచేసుకుంది.
 
ఘాట్ రోడ్‌ను దాటే క్రమంలో తల్లి కొండముచ్చును అతుక్కుని ఉన్న పిల్ల కొండముచ్చు జారి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో ఓ వాహనం క్షణకాలంలో ఆపిల్ల కొండముచ్చు పై నుంచి వెళ్లిపోయింది. అంతే క్షణాల్లో దాని ప్రాణం పోయింది.. అంతవరకు తనతోనే ఉన్న బిడ్డకు ఏమైందో తెలియక తల్లిడిల్లిపోయింది ఆ తల్లి కొండముచ్చు హృదయం.
 
తన బిడ్డను రోడ్డు పక్కగా తీసుకువచ్చింది. అంతవరకూ గెంతుతూ ఆడుకున్న తన చిన్నారి ఎందుకు చలనం లేకుండా ఉందో తెలియక అటుఇటు కదిపి చూస్తూ చాలాసేపు ఉండిపోయంది. ఎంతకూ బిడ్డలో కదలికలు లేకపోవడంతో వెళ్లలేక వెళ్లలేక భారంగా అక్కడనుంచి వెళ్లిపోయింది ఆ తల్లి కొండముచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments