నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2 లక్షల డబ్బాతో సర్వర్ చెన్నయ్య ఉడాయించినట్టు సమాచారం. ఈ విషయం చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింద
నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2 లక్షల డబ్బాతో సర్వర్ చెన్నయ్య ఉడాయించినట్టు సమాచారం. ఈ విషయం చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
చిరంజీవి నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. ఈ ఇంట్లో పనిచేసే సర్వర్ చెన్నయ్య అలియాస్ చిన్నా పని చేస్తున్నాడు. ఆయన రూ.2 లక్షల డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
చిరంజీవి వ్యక్తిగత మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.